బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం

Tue,November 12, 2019 03:10 AM

గాంధారి : బాల్యవివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని గాంధారి ఎస్సై ప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని గండివేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమావారం పోలీసు కళా బృందం సభ్యులు ప్రదర్శన నిచ్చారు. ఈ సందర్భంగా మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, చదువుకోవడంతో ప్రయోజనాలు, ర్యాగింగ్ చేయడంతో పడే ఇబ్బందులు, పోలీస్, షీ టీం విధులు తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ అబ్దుల్ ఫారుక్, ఎంపీటీసీ బూస సారికాశ్రీనివాస్, ఉప సర్పంచ్ ఇంద్రాగౌడ్, సంగెంరాజు, కానిస్టేబుళ్లు, గ్రామస్తులు ఉన్నారు.

బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి
లింగంపేట: గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత విద్యార్థులపై ఉందని ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని కసూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడంతో కలిగే అనర్థాలను గ్రామీణులకు వివరించాలని వెల్లడించారు. చిన్న వయస్సులోనే అమ్మాయి వివాహంచేసి భారం తగ్గించుకోవాలని తల్లిదండ్రులు యోచిస్తుంటారన్నారు. బాల్య వివాహాలు చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాలన్నారు. బాలల హక్కులపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు బాల్య వివాహాల తో కలిగే అనర్థాలు అనే అంశంపై పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌వో వాసంతి, ఐసీడీఎస్ సీడీపీవో సునంద, సర్పంచ్ బొల్లు లావణ్య, ఎంపీటీసీ సభ్యురాలు షమీమున్నీసాబేగం, యువ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, సూపర్‌వైజర్ స్వరూపరాణి, మాజీ ఎంపీటీసీ ఫతియుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles