పేదవారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకే డబుల్ ఇండ్లు

Tue,November 12, 2019 03:10 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : పేదవారు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ ఎస్సీ కాలనీలో 76 మంది లబ్ధిదారులకు నిర్మించి ఇచ్చే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు లబ్ధిదారులతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం వారికి ఇండ్ల కొలతలు చూపి నిర్మాణ తీరును వివరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులకు అన్ని వసతులతో 5 లక్షల 30 వేల రూపాయలతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. త్వరలోనే మరో 40 ఇండ్లు లబ్ధిదారులకు నిర్మించి ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు దేశాయిపేట్ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్, రైతుసమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఏర్వాల కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నందిని, రమాదేవి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles