కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Tue,November 12, 2019 03:09 AM

బీబీపేట్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. మండలంలోని జనగామ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో మమత, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఎంబరి గంగాధర్, సీఈవో నర్సాగౌడ్ మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1835, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1815 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ పాత రాజు, వైస్ ఎంపీపీ కప్పెర రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఎల్లం, క్లస్టర్ ఆఫీసర్ సాయిలు, ఆడిటర్ మసుద్దీన్, సొసైటీ డైరెక్టర్లు వెంకట్‌రాంరెడ్డి, వెంకట్‌గౌడ్, కిషన్‌రావు, రాజయ్య, మాజీ సర్పంచులు మట్ట శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామాధ్యక్షుడు పాత పండరి, ఏఈవో సాగర్, సొసైటీ సిబ్బంది బాల్‌రాజ్, గడ్డం రవి, నర్సింహులు, రైతులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles