కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తారు..

Tue,November 12, 2019 03:09 AM

కార్తీక పౌర్ణమి రోజు స్త్రీలు పగలంతా ఉపవాసం చేసి సాయంకాలం చంద్రోదయం తరువాత తులసీ తోటలో దీపాలు వెలిగించి తమల పాకు మీద రాగి నాణెం ఉంచి దానికి కుంకుమ, చందనం అద్ది చంద్రున్ని పూజిస్తారు. చిమిడి, కామా, పండ్లను నైవేద్యంగా పెట్టి పూజ అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని భుజిస్తారు. ఇలా చంద్రున్ని భుజించడం కడుపు చలువ కోసం అనగా తమ సంతానం ఆరోగ్యం కోసం సుఖంగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తారు. అదే విధంగా అశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక అమావాస్య వరకు రోజూ సంధ్యా సమయంలో గడపకు ఇరు వైపులా రెండు దీపాలను వెలిగిస్తారు. సాయంత్రం పూజా అనంతరం దేవుని ఫలహారాన్ని పంచిపెడతారు.

జ్వాలా తోరణ ప్రత్యేక ఉత్సవం..
కార్తీక పౌర్ణమి నాడు కొన్ని చోట్ల మరో జ్వాలా తోరణ ఉత్సవం నిర్వహించుకుంటారు. కార్తీక పౌర్ణమి జరుపుకునే జ్వాలా తోరణోత్స వానికి పలువురు పలు రీతుల పురాణ గాథలు చెబుతారు. సముద్ర మదన కాలం పుట్టిన హలా హలాన్ని లోకహితార్థం కోసం రుశీశ్వరుడు మింగుతాడు. ఆ సమయంలో భక్తులకు ప్రాణా ప్రాయం కలుగకుండా ఉండడానికి పార్వతి దేవి తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ భర్త కంఠాన్ని పట్టు కుంటుంది. ఆ విషం కఠంలోనే నిలిచిపోతుంది. అందుకే పరమేశ్వరున్ని గరళ కంఠుడు అనే పేరుకూడా వచ్చింది. తదనంతరం శివుడు ఎట్టి ఆపద లేకుండా బయట పడ్డాడు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles