నేటి నుంచే తరగతులు ప్రారంభించాలి

Mon,November 11, 2019 01:06 AM

-స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
-గిరిజన గురుకుల పాఠశాల పరిశీలన
-పనులు పూర్తి కావడంపై సంతృప్తి
-సోమవారం ప్రారంభోత్సవానికి మంత్రుల హాజరు..

నస్రుల్లాబాద్ : మండల కేంద్రంలో రూ. 4.20 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల బాలుర పాఠశాలను గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. భవనాన్ని, గదులను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యత, సకాలంలో పూర్తిచేయడంపై స్పీకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. సోమవారం నుంచే నూతన భవనంలో విద్యా బోధన, వసతి సౌకర్యాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు రామకృష్ణ, వెంకన్న, బాన్సువాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మాజిద్, ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రావు, నాయకులు ప్రతాప్, లక్ష్మీనారాయణ గౌడ్, సాయిలు, సక్రు ,ఫకీరా తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న స్పీకర్...
బీర్కూర్ : మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయన ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. వచ్చే ఏడాది ఈ రోజులోగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిదుతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యలో రోజు రోజుకూ పెరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పోచారం శంభురెడ్డి, సురేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles