ఘనంగా మిలాద్-ఉన్- నబీ

Mon,November 11, 2019 01:04 AM

విద్యానగర్ : జిల్లా కేంద్రంలో మిలాద్-ఉన్- నబీ వేడుకలను ముస్లిములు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. మహ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు. యువకులు పట్టణంలోని సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్, పెద్ద బజార్, విద్యానగర్, హైవే రోడ్‌తో పాటు పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జిల్లా మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... త్యాగం, సహనం, సోదరభావం, కరుణ, దయ, క్షమాగుణాలు కలిగిన మహ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు సన్మార్గంలో నడవాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ మేసా జిల్లా అధ్యక్షుడు బషీర్, ప్రధాన కార్యదర్శి గఫూర్ శిక్షక్, ప్రతినిధులు షకీల్, నిజాం, ఖాసిం, ఇమ్రాన్, మాజీ కౌన్సిలర్ అంజద్, మహ్మద్ మిర్జా అస్లాం, మహ్మద్ వసీం, షకీల్, ఇమ్రాన్, ఇక్రం, ఖలీం తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles