తాళం వేసిన ఇంట్లో చోరీ

Mon,November 11, 2019 01:03 AM

నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా గాయత్రీనగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ముబారక్‌నగర్ డివిజన్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ అపార్ట్‌మెంట్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..3 తులాల బంగారం గుండ్లు, నాలుగు జతల చెవికమ్మలు(12గ్రాములు), ఆరు గ్రాముల బంగారం ముక్కుపుడుకాలు, తులం బంగారం లాకెట్ తదితర బంగారం వస్తువులు, రూ. 5వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని బాధితురాలు వంగ సుప్రియ తెలిపిన వివరాల ప్రకారం... శనివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి చెప్పి భీమ్‌గల్ వెళ్లారు.

ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో అద్దెకు ఉంటున్న ప్రియా అనే మహిళ చూసి ఫోన్ తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పడంతో తిరిగి తన అన్నకు ఫోన్ చేసి ఇంటికి వచ్చామని సుప్రియ తెలిపారు. ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్ రూంలోని ఫర్నీచర్‌తో తయారు చేసినబీరువాలోని లాకర్లను ధ్వంసం చేసి అందులో ఉన్న ఆరు తులాల బంగారం కమ్మలు, గుండ్లు, రూ.5వేల నగదును తీసుకువెళ్లారని తెలిపారు. ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను రాడ్‌తో ధ్వంసం చేశారని తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు, క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. సుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్న ఎస్సై ప్రభాకర్ తెలిపారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles