ముగిసిన విభాగ్ స్థాయి ఖేల్‌కూద్ పోటీలు

Mon,November 11, 2019 01:03 AM

విద్యానగర్ : జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి ఖేల్‌కూద్ ముగింపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని అన్నారు. క్రీడలు మానసికోసాల్లానికి దోహదపడుతాయని, విద్యార్థులు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. దక్షిణమధ్య క్షేత్ర అధ్యక్షుడు చామర్తి ఉమామహేశ్వర్‌రావు మాట్లాడుతూ.. శిశు మందిరాలు ఎంతో మంది విద్యార్థులను సంస్కార వంతమైన పౌరులుగా తీర్చిదిద్దాయన్నారు. అనంతరం గెలపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు శ్యాంసుందర్, రంజిత్ మోహన్, బొడ్డు శంకర్, ఎస్‌ఎన్ చారి, విజయ భాస్కర్, గోవర్ధన్ రెడ్డి, జైపాల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం, నగేశ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles