వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Sun,November 10, 2019 12:51 AM

ముప్కాల్: మండలంలోని నల్లూర్ నుంచి పెద్దవాగు పోయే మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెంజర్ల గ్రామానికి చెందిన షేక్‌హుస్సేన్ (44) మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెంజర్ల గ్రామానికి చెందిన షేక్‌హుస్సేన్ అదే గ్రామంలోని విజ్ఞాన్ మాడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముప్కాల్ నుంచి తన కూతురు, మనుమరాలును తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రెంజర్ల నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీ కొంది. కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అతడి తలకు బలమైనగాయాలయ్యాయి. వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌భరత్ రెడ్డి తెలిపారు.

బావిలో పడి రైతు ..
లింగంపేట(తాడ్వాయి): మండల కేంద్రానికి చెందిన రైతు సిద్దిరాంరెడ్డి (45) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై ప్రకాశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పొలం పనులు ముగించుకుని భోజనం చేయడానికి సమీపంలోని దుడ్డె శివయ్య పొలంలోని బావిలోకి దిగి బిందెతో నీటిని తీసుకొచ్చి భార్య సావిత్రికి అందించాడు. అనంతరం స్నానం చేయడానికి బావిలో దిగగా మునిగిపోయాడు. భర్త నీటిలో మునిగిన విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకునేలోగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డిలోని సర్కారు దవాఖానాకు తరలించారు. మృతుడికి భార్య సావిత్రి, కుమారుడు సృజన్ ఉన్నారు.

మంజీర నదిలో ఒకరు..
నాగిరెడ్డిపేట్ : మండలంలోని చీనూర్ గ్రామానికి చెందిన అశోక్ (29) ఈత రాకపోవడంతో మంజీర నదిలో పడి మృతి చెందినట్లు ఎస్సై మోహన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చీనూర్ గ్రామానికి చెందిన అశోక్ శుక్రవారం ఉదయం గేదెలను మేపడానికి ప్రతి రోజూ మాదిరిగానే వెళ్లాడు. గేదెలు పక్కనే ఉన్న మంజీర వాగులోకి వెళ్లడంతో వాటిని తీసుకురావడానికి అశోక్ నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువడా ఉండడంతో ఈత రాక నీటిలో చిక్కుకుని మృతి చెందాడు. శనివారం ఉదయం నీటిలో గాలించగా మృతదేహం దొరికింది. శవాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం చేయడానికి తరలించారు. తండ్రి అంజాగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles