కామారెడ్డి శిశు మందిర్‌లో విభాగ్‌స్థాయి ఖేల్‌కూద్ ప్రారంభం

Sun,November 10, 2019 12:50 AM

విద్యానగర్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో విభా గ్ స్థాయి ఖేల్‌కూద్ శనివారం ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, వ్యాపారవేత్త విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకరావాలని అన్నారు. ఇందూర్ విభాగ్ కార్యదర్శి హరిస్మరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో విద్యార్థుల్లో మానసిక ైస్థెర్యం,శారీరక దృఢత్వం పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ఈ పోటీల్లో కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీలు ఆదివారం కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు డాక్టర్ శ్యాంసుందర్‌రావు, రంజిత్‌మోహన్, ప్రతాప్‌గౌడ్, ఎస్‌ఎన్ చారి, డాక్టర్ బసంత్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నాటభూషణం, నగేశ్, ఆచార్య బృందం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles