నాగరాజుకు ఉత్తమ సీనియర్ శాస్త్రవేత్త పురస్కారం

Sun,November 10, 2019 12:50 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు ఉత్తమ సీనియర్ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికయ్యారు. భారతదేశ ప్రభుత్వంతో గుర్తింపు పొందిన నావెల్ రీసెర్చ్ అకాడమీ, పుదుచ్చేరి సంస్థ ద్వారా శనివారం పాండిచ్చేరి లో డాక్టర్ నాగరాజు పురస్కారాన్ని అందుకున్నారు. రసాయన శాస్త్రబోధన, పరిశోధన రంగాల్లో విశేష కృషి చేస్తున్న డాక్టర్ నాగరాజు సేవలు గుర్తించి ఈ పురస్కారాన్ని అందించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. పాండిచ్చేరికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎం.కందసామి, పుదుచ్చేరి శాసనసభాసభ్యుడు ఎ.జాడకుమార్ ద్వారా ఆయన అవార్డును స్వీకరించారు. రసాయన శాస్త్ర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ బోధన, పరిశోధనలో ఉత్తమ సేవ లు అందిస్తున్నారు.

22 సంవత్సరాల సుదీర్ఘమైన బోధనా అనుభవం, 16 సంవత్సరాల సుదీర్ఘమైన పరిశోధనానుభవం కలిగిన డాక్టర్ నాగరాజు తన రసాయన శాస్త్ర పరిశోధనానుభవం 68 వరకు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలను ప్ర చురించారు. గూగుల్ స్కాలర్ ఇండాక్స్‌లో కూడా అత్యధిక సైటేషన్స్ కలిగిన పరిశోధనా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. పరిశోధనా పత్రాలు, పరిశోధనా వ్యాసాలు, ప్రాజెక్టుల రూపకల్పనలో, ప్రయోగ విధానంలో అనుభవం కలవారు. ఐదు పరిశోధనా జర్నల్స్‌లో ఎడిటర్‌గా, బోర్డ్ మెంబర్‌గా సేవలు అందిస్తున్నారు. డాక్టర్ నాగరాజు ఇదివరకు ఉత్తమ రాష్ట్ర అధ్యాపక అవార్డు, ఉత్తమ డిజిటల్ అధ్యాపక అవార్డును అందుకున్నా డు. ఈ సందర్భంగా నాగరాజును టీయూ ఉపకులప తి అనిల్‌కుమార్, రిజిస్ట్రార్ డి.బలరాములు, అధ్యాపకులు, పరిశోధకులు అభినందనలు తెలిపారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles