త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలి

Sat,November 9, 2019 04:22 AM

-త్వరలో కేజీబీవీ భవనాలు అందుబాటులోకి తేవాలి
-విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
-కలెక్టర్ సత్యనారాయణ
-సమీక్షా సమావేశంలో అధికారులకు సూచన

విద్యానగర్ : జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కేజీబీవీ పర్యవేక్షణ అభియాన్ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాలల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని బీబీపేట్, రాజంపేట్, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, లింగంపేట్, భిక్కనూరులో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని సూచించారు. కేజీబీవీల్లో టాయిలెట్స్, ఫ్యాన్స్, మౌలిక వసతులు కల్పించాలన్నారు. మండల రిసోర్స్ పర్సన్స్ నిర్మాణ పనులు, వసతుల కల్పన పర్యవేక్షించాలని అన్నారు. 19 కేజీబీవీల్లో త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం వెంటనే కల్పించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జడ్పీ సీఈవో కాంతమ్మ, డీపీవో నరేశ్, సీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, డీఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles