రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థుల ఎంపిక

Sat,November 9, 2019 04:08 AM

ఎల్లారెడ్డి రూరల్ : రాష్ట్రస్థాయి మ్యాథ్స్, సైన్స్ ఫెయిర్‌కు ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్, కామారెడ్డి గురుకులాల సమన్వయ అధికారి మహేందర్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గురుకుల పాఠశాలలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్‌లో ఈ నెల 4,5వ తేదీల్లో నిర్వహించిన జోనల్‌స్థాయి మ్యాథ్స్, సైన్స్ ఫెయిర్‌లో ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఆర్.రజనీకాంత్, సీహెచ్.నందు పాల్గొని ద్వితీయ బహుమతి సాధించారని చెప్పారు. అప్లికేషన్ ఆఫ్ కొనిక్ సెక్షన్ అనే అంశంపై జరిగిన పోటీలకు నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. జోనల్‌స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులను, ప్రోత్సహించిన మ్యాథ్స్ ఉపాధ్యాయులు నరేశ్‌కుమార్, శ్రీనివాస్, సమీన ఫిర్దౌస్‌ను వారు అభినందించారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles