అన్ని రూట్లలో బస్సులు

Fri,November 8, 2019 12:53 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ, విద్యానగర్ : ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో నిర్విరామంగా నడుపుతున్నారు. 34వ రోజైన గురువారం ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించలేదు. కామారెడ్డి డిపో నుంచి ప్రతి రూట్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ట్రిప్పులను పెంచుతున్నారు. కామారెడ్డి డిపో నుంచి 95 ఆర్టీసీ బస్సులు, 33 అద్దెబస్సులు నడిపించారు. కామారెడ్డి డిపో నుంచి కరీంనగర్, నిజామాబాద్, నిజాంసాగర్, జేబీఎస్, బాన్సువాడ, రామాయణ్‌పేట్ తదితర ప్రాంతాలకు బసులు నడిపించారు. ఆర్టీసీ బస్సులు పెరగడంతో ప్రయాణికులతో బస్టాండ్ కిటకిటలాడింది. బస్టాండ్‌లో అన్ని రూట్లకు వెళ్లే బస్సులను ప్లాట్ ఫాంలపై సిద్ధంగా ఉంచుతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను యథావిధిగా నడిపిస్తున్నారు.

అన్ని రూట్లలో బస్సులు...
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ డీఎం ఆంజనేయులు, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎంవీఐ శ్రీనివాస్‌రావు సమన్వయంతో అన్ని రూట్లలో బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నారు అధికారులు దగ్గరుండి బస్సులు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కార్మికుల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా బస్సులు నడిపారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఆర్టీసీ కార్మికులకు బీజేపీ నాయకుల మద్దతు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మద్దతు తెలిపిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడలో స్పీడ్ పెంచిన ఆర్టీసీ
బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఆర్టీసీ బస్సులను నడపడంలో అధికారులు స్పీడ్ పెంచారు. గురువారం ఉదయం 4 గంటల నుంచే బస్సులను అన్ని రూట్లలో పంపినట్లు నోడల్ అధికారి, బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ తెలిపారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బస్సులను అన్ని గ్రామాలకు పంపామని తెలిపారు. బాన్సువాడలో 58 ఆర్టీసీ బస్సులు, 19 హైర్ బస్సులు, 40 మాక్సీ క్యాబ్‌లు, ఒక పబ్లిక్ సర్వీస్ వెహికిల్ (పీఎస్వీ) నడిపామని తెలిపారు. సమ్మెకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులు పాదయ్రాతగా బాన్సువాడకు చేరుకొని ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles