దోమకొండ: ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మరమ్మతులు, దీపధూప నైవేద్యాలకు నిధులు మంజూరు చేస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీమాతృ గురుపీఠం సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్మాణం చేపడుతుండగా.. ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ పనులకు గురువారం భూమిపూజతో పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మించడం అభినందనీయమని అన్నారు.
రాష్ట్రంలో ఇలాంటి నిర్మాణం ఎక్కడా లేదన్నారు. అనంతరం గురుపీఠం సొసైటీ సభ్యులు విప్‌ను ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్, మాజీ జడ్పీటీసీ గండ్ర మాధుసూదన్రావు, విండో చైర్మన్ నర్సారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐరేని నర్సయ్య, ఎంపీపీ కోట సదానంద, ఎంపీటీసీలు కానుగంటి శారద, సర్పంచులు అంజలి, నర్సవ్వ, సాయిలు, ఉప సర్పంచ్ శ్రీకాంత్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు తిరుపతి గౌడ్, నవీన్, శేఖర్, ఆలయ సొసైటీ సభ్యుడు కృష్టముర్తి శరత్ ఆంజనేయశర్మ తదితరులు తదితరులు పాల్గోన్నారు.