ఆగని ప్రయాణం..

Thu,November 7, 2019 12:25 AM

-అన్ని రూట్లలో రాకపోకలు
-33వ రోజు కనిపించని సమ్మె ప్రభావం
-సమన్వయంతో ముందుకు సాగుతున్న అధికారులు
-సందడిగా మారుతున్న ప్రయాణ ప్రాంగణాలు

కామారెడ్డి, నమస్తే తెలంగాణ/విద్యానగర్ : ప్రభు త్వ యంత్రాంగం ఆర్టీసీ బస్సులను అన్ని రూట్లలో పరుగులు పెట్టిస్తున్నది. 33వ రోజు బుధవారం స మ్మె ప్రభావం కనిపించలేదు. ఆర్టీసీ బస్సులతో పాటు హైర్ బస్సులు నడిపించారు. కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి బుధవారం 95 ఆర్టీసీ, 33 అద్దె బస్సులను నడిపించారు. డిపో నుంచి హైదరాబా ద్, నిజామాబాద్, రామాయంపేట్, కరీంనగర్, నిజాంసాగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాం తాలకు బస్సులు నడిపించారు. కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ డీవీఎం గణపతిరాజు, డీఎం ఆంజనేయులు, ఆర్టీఏ అధికారిణి వాణి ఎంవీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బస్సులను అన్ని రూట్లలో మానిటరింగ్ నిర్వహిస్తున్నారు. బస్టాండ్‌ల ఆవరణలో ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రయణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు. 33 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నా రోజు రోజుకూ బస్టాండ్‌లో ప్రయాణికుల సందడి పెరుగుతున్నది. ప్రతి రోజు అధికారులు అన్ని రూట్లలో బస్సు ట్రిప్పులను పెంచడంతో ప్రయణికుల తాకిడి పెరిగింది. ప్రయణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ, పోలీసు శాఖలు ఎప్పటికప్పు డు రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నాయి. డిపో పరిధి నుంచి అన్ని రూట్లలో బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

కార్మికుల ముందస్తు అరెస్టులు..
ముందస్తు జాగ్రత్తలో భాగంగా బుధవారం ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి డివిజన్‌లోని పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. కార్మికులు బస్టాండ్ లోపలికి వెళ్లి ఆందోళన చేయడానికి ప్రయత్నించడంతో ముందస్తు అరెస్టులు చేసినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

కొనసాగుతున్న కార్మికుల సమ్మె
బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 33వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో బస్సులను ఆపేందుకు వామపక్ష పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు, ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎంత చెప్పినా ఆందోళన విరమించలేదు. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడడంతో డీఎస్పీ దామోదర్ రెడ్డి, పట్టణ సీఐ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు 36 మందిని పోలీస్ స్టేషన్ లకు తరలించారు. పట్టణంలో ఇబ్బందులు సృష్టిస్తే చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles