రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతుపై కేసు

Thu,November 7, 2019 12:23 AM

నందిపేట్ : నిర్లక్ష్యంగా రోడ్డుపై ధాన్యం ఆరబోసి ప్రమాదానికి కారకుడైన రైతు మురళిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేంధర్ తెలిపారు. నందిపేట్, నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై బంగారు ఇరిగేషన్ ఫ్యాక్టరీ ఎదురుగా రైతు మురళి ధాన్యం ఎండబోసి ఆరిన తర్వాత కుప్పచేసి అలాగే ఉంచాడని, మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు బైక్‌పై నిజామాబాద్ వైపు వెళ్తుండగా వరి కుప్పపైకి ఎక్కించారు. వెనక కూర్చున్న ఇద్దరు నిమ్మ దీపక్, స్వర్ణ రాజ్ మృతిచెందగా, బైక్ నడుపుతున్న మరో యువకుడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్‌కుమార్ సందర్శించా రు. ధాన్యం కుప్ప వద్ద పంచనామా జరిపి వివరాలు సేకరించారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles