వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య

Thu,November 7, 2019 12:23 AM

రెంజల్ : మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పల్లపు రాజు (40) అనే వ్యక్తి బుధవారం చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జందార్ రియాజ్ తెలిపారు. తాగుడుకు బానిసైన రాజు తరుచూ డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవ పడే వాడు. జీవితంపై విరక్తి చెందిన రాజు మంగళవారం గ్రామ శివారులోని గణేశ్‌కుంట చెరువులోపడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య భూలక్ష్మి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రెంజల్ పోలీసులు పంచనామా నిర్వహించారు. శవ పరీక్ష కోసం బోధన్ దవాఖానకు తరలించినట్లు రియాజ్ చెప్పారు. మృత్యుడికి భార్య కొడుకు, కుతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

బావిలో పడి వివాహిత..
విద్యానగర్(రామారెడ్డి) : రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన వివాహిత బండి లావణ్య(28) బావిలో దూకి ఆత్మ హత్య చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్యతో అత్తమామలు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె రాత్రి ఎవరూ లేని సమయంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుం ది. లావణ్య భర్త సురేశ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అత్తమామ మంగళవారం రాత్రి ఆమెతో గొడవ పడడంతో మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. లావణ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కామారెడ్డి ఏరియా వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

ఉరేసుకొని యువకుడు..
వర్ని : మండలంలోని తగిలేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దేవపల్లి గ్రామానికి చెందిన కృష్ణ(35) రెండు సంవత్సరాల క్రితం అత్తగారి గ్రామం అయిన తగిలేపల్లిలో భార్య లక్ష్మితో కలిసి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. కృష్ణకు కూతురు, కొడుకు ఉన్నారు. కృష్ణ కుటుంబంలో నిత్యం ఘర్షణలు జరుగుతూ ఉండేవి. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఆయన ఉరేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బోధన్ ప్రభుత్వ దవాఖానకు పంపించినట్లు తెలిపారు.

కడుపునొప్పి భరించలేక మరొకరు..
నందిపేట్ : మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన బిల్లా వెంకటేశ్వర్లు (30) అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. ఎప్పుడూ ఆవేదన, ఆందోళనతో మనస్తాపానికి గురయ్యే వాడు. కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతుండగా.. రెండు రోజులుగా కడుపుకొన్ని తీవ్రం కావడంతో ఆందోళనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంటి దూలానికి ఉరేసుకొ న్నాడు. మృతుడి భార్య లహరిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు ఎస్సై వివరించారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles