వేగం పెంచాలి..

Wed,November 6, 2019 01:55 AM

కామారెడ్డిరూరల్‌ / బీబీపేట్‌ / దోమకొండ : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ సత్యనారాయణ కాంట్రాక్టర్లకు సూచించారు. కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి, దోమకొండ మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పనులు వేగవంతంగా, నాణ్యతతో చేపట్టాలని అన్నారు. నిరుపేదలకు అందజేయాలనే లక్ష్యంతో చేపట్టిన డబుల్‌ బెడ్‌రూములు అర్హులైన వారికి అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పరిసరాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. చిన్నామల్లారెడ్డి గ్రామంలో సర్పంచ్‌ రత్నాబాయి, మాజీ సర్పంచ్‌ రామాగౌడ్‌, నాయకులు కమ్మరి శ్రీను, రమేశ్‌రెడ్డి, గంగాధర్‌ రావు, ఆసం శ్రీను, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దోమకొండ మండల కేంద్రంలో జిల్లా పంచాయతీ అధికారి రాజు, ఇంజినీర్‌ సిద్దరాములు, డీఈ మురళి, ఏఈ ఆదిత్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీబీపేట్‌ మండలంలోని యాడారం గ్రామంలో నిర్మాణం పూర్తయిన 30 డబుల్‌ బెడ్‌రూములను, జనగామలో చివరి దశలో ఉన్న 50 డబుల్‌ బెడ్‌రూముల నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సర్పంచులు వెంకట్‌రావు, రాజు, వైస్‌ ఎంపీపీ కప్పెర రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రవి, ఉప సర్పంచులు ఎల్లం, హరీశ్‌, డీఈ మురళి, ఏఈ ఆదిత్యరెడ్డి, మాజీ సర్పంచ్‌ మట్ట శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles