కామారెడ్డి నమస్తేతెలంగాణ , వి ద్యానగర్ : ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో పరుగులు పెడుతున్నా యి. ఆర్టీసీ జేఎసీ సమ్మె ప్రభావం మంగళవారం ఎక్కడా కనిపించలేదు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. ప్రయణికులతో బస్టాండ్ కిటకిటలాడింది. అధికారులు, ప్రయణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్ ట్రిప్పులను పెంచారు. ప్లాట్ ఫాంల వద్ద బస్సులను సిద్ధంగా ఉంచుతున్నారు. సిద్ధంగా ఉంచా రు. రెవెన్యూ, పోలీసు, రవాణా, ఆర్టీసీ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో బస్సులను అన్ని రూట్లలో తరలిస్తున్నారు.
ప్రయణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు
కామారెడ్డి డిపో నుంచి మంగళవారం 96 ఆర్టీసీ బస్సులు, 33 అద్దె బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు ప్రయణికులను తరలించాయి. జేబీఎస్, నిజామాబాద్, రూట్లలో నాన్‌స్టాప్ బస్సులు నడుపగా కరీంనగర్, నిజాంసాగర్, రామాయంపేట్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర రూట్లలో పల్లెవెలుగు బస్సుల ద్వారా ప్రజారవాణాను కొనసాగించారు. ప్రభుత్వ యంత్రాంగంలోని పలు శాఖలు సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో కొన్ని రోజులుగా అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచా రు. దీంతో పల్లె నుంచి పట్నం వరకు ప్రజారవాణా సాఫీగా కొనసాగుతున్నది. కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం పడకుండా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజారవాణా కొనసాగిస్తున్నది
కొనసాగిన ఆందోళనలు
ఆర్టీసీ కార్మికులు 32వ రోజు అయిన మంగళవారం ఆందోళన కొనసా గించారు. బస్టాండ్ నుంచి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, సుభాష్‌రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఎదురుగా గల ఇన్‌గేట్, ఔట్ గేట్ ముందు గంట పాటు ఆం దోళన నిర్వహించారు. అనంతరం టెంట్ వద్దకు చేరుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.