అన్ని రూట్లలో ఆర్టీసీ పరుగులు

Wed,October 23, 2019 02:02 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ/విద్యానగర్‌ : ఆర్టీసీ బస్సు లు అన్ని రూట్లలో పరుగులు పెడుతున్నాయి. సోమ వారం నుంచి కళాశాలు, పాఠశాలలు ప్రారంభం కావడంతో బస్టాండ్లు సందడిగా మారాయి. కామారెడ్డి ఆర్డీవో, నోడల్‌ అధికారి రాజేంద్రకుమార్‌ ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు డిపోలోనే ఉంటూ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పలు సూచనలు అంద జేశారు. మంగళవారం నుంచి షిప్టుల పద్ధతిలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రఘునాథ్‌, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి శేఖర్‌ను నియమించారు. ఇప్పటికే ఆడిట్‌ శాఖకు చెందిన అధికారులు తాత్కాలిక కండక్టర్లు తె స్తున్న నగదు లెక్క చూసుకుని బ్యాంకుల్లో జమచేస్తున్నారు. వీరికి తోడుగా కోపరేటివ్‌ అధికారులను కూడా నియమించారు. కామారెడ్డి డిపో నుంచి మంగళవారం 95 ఆర్టీసీ బస్సులు, 33 అద్దె బస్సులతో పాటు ప్రైవేట్‌ వాహనాలు ప్రయణికులను తరలించాయి.

బస్టాండ్‌ను సందర్శించిన కలెక్టర్‌, ఎస్పీ
కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి మంగళవారం కామారెడ్డి బస్‌డిపో, బస్టాండ్‌ను సందర్శించారు. డీవీఎం గణపతిరాజు, డీఎం ఆంజనేయులుకు పలు సూచనలు చేశారు. అన్ని రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రయణికుల రద్దీకి అనుగుణంగా బస్సు ట్రిప్పులను పెంచాలని సూచించారు. తాత్కాలిక సిబ్బందితో కలెక్టర్‌ మాట్లాడారు. ఎలాం టి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు నోడల్‌ అధికారి ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇతర అధికారులు ఉన్నారు.

కార్మికుల నిరసన
ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. బస్టాండ్‌ నుంచి ర్యాలీ నిర్వ హించారు. తిరిగి బస్టాండ్‌ వద్దకు చేరుకుని టెంట్‌ వద్ద చేరుకుని వంటా వార్పు చేసి నిరసన తెలిపారు.

బాన్సువాడలో జోరుగా..
బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ ఆర్టీసీ డిపో నుంచి బస్సులను పంపడంలో అధికారులు స్పీడ్‌ పెం చారు. మంగళవారం బాన్సువాడ డ్రైవర్లు, కండక్టర్లుగా పని చేసేందుకు పెద్ద సంఖ్యలో యువతీ,యువకులు తరలిరావడంతో ఆర్టీసీ డీఎం సాయన్న, నోడల్‌ అధికారులు, లోకల్‌ ఆడిట్‌ అధికారులు వారికి రోజు తప్పి రోజు పనిచేందుకు ఆవకాశం కల్పిస్తున్నారు. టిమ్స్‌ మిషన్ల ద్వారా టిక్కెట్లు జారీ చేస్తూ కలెక్షన్‌ సరిగ్గా తెచ్చే వారికే డ్యూటీలు వేస్తున్నారు. బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో వివిధ ప్రాంతాలకు, గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తరలిరావడంతో బస్టాండ్‌ కిటకిటలాడింది.

సమ్మెకు సహకరించాలని వినతి..
బాన్సువాడలో మంగళవారం కార్మికులు తాత్కాలిక సిబ్బందికి ఆర్టీసీ కార్మికులు పుష్పాలు ఇచ్చి సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి అన్ని రూట్లకు బస్సులను నడుపాలని నానాదాలు చేశారు. అంబేద్కర్‌ చౌరస్తాలో బీసీ విద్యార్థి సంఘం, టీజీవీపీ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, తదితర విద్యార్థి సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సీఐ మహేశ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. కా ర్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ గంగాధర్‌, గిరి, సాజిద్‌, మల్లయ్య, బస్వంత్‌, నాగరాజు, ప్రశాంత్‌ రెడ్డి, రామాగౌడ్‌, కుమారదేవాంగ, ఖయ్యుం, రాధ, సవిత, మంజుల, సంధ్య, విమల, విద్యార్థి సంఘాల నాయకులు ప్రవీన్‌ గౌడ్‌, గంగారెడ్డి, ఖలీల్‌, హన్మాండ్లు, సాయిలు తదితరులు ఉన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles