కళాశాలలో బయోమెట్రిక్‌పై అవగాహన

Tue,October 22, 2019 02:18 AM

ఎల్లారెడ్డి రూరల్ : బయోమెట్రిక్‌లో హాజరుశాతా న్ని నమోదు చేయడం భారం కాదని, అది మన బాధ్యత అని ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బయోమెట్రిక్ విధానంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం తప్పరిసరిగా వేలిముద్రల ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని అన్నారు. బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల హాజరుశాతాన్ని నమోదు చేయడంతో విద్యార్థుల హాజరు శాతంలో మార్పు కనిపిస్తుందని, హాజరు శాతం మె రుగుపడుతుందన్నారు. విద్యార్థుల హాజరుశాతం పెరగడంతో విద్యార్థుల్లో చదువుపై ధ్యాస పెరుగుతుందని, ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించ వచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో బయోమెట్రిక్ విధానంలో హాజరుశాతాన్ని నమోదు చేశారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles