సమన్వయంతో ప్రశాంతంగా..

Mon,October 21, 2019 12:21 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల నిర్వహిస్తున్న సమ్మె 16వ రోజు కు చేరుకోవడంతో ప్రయాణికులకు ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కం డక్టర్లు రాకపోవడంతో తక్కువ బస్సులు నడిపిన అధికారులు ఆదివారం ఉదయం నుంచే పూర్తిస్థాయిలో బస్సులు నడిపారు. డీఎం సాయన్న, నోడ ల్ అధికారి, బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ సమన్వయంతో 71 బస్సులు నడిపారు.

తాత్కాలిక కండక్టర్లకు శిక్షణ
బాన్సువాడ ఆర్టీసీ సమ్మె కొనసాగడంతో నిత్యం డ్యూటీలు చేస్తున్న తాత్కాలిక కండక్టర్లకు ఆదివారం రెవెన్యూ కార్యాలయ సిబ్బంది టికెట్లు ఇచ్చే మిషన్లపై 60 మందికి అవగాహన కల్పించా రు. ఉదయం 5 గంటల నుంచి తొమ్మిది గంట ల వరకు సుమారు 35 మంది తాత్కాలిక కండక్టర్లకు టికెట్ మిషన్‌లను ఇచ్చి దూరప్రాంతాలకు పంపించారు.

పకడ్బందీగా నిఘా..
బాన్సువాడ ఆర్టీసీ డిపోలో డ్యూటీలు నిర్వహిస్తున్న తాత్కాలిక కండక్టర్లపై. డిపో సిబ్బందిపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో డీఎం సాయన్న నోడల్ అధికారి రాజేశ్వర్ కలెక్టర్ ఆదేశానుసారంతో ప్ర త్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. బస్సు డిపో నుంచి వెళ్లే సమయంలో, లేక వచ్చిన సమయంలో బస్సులో ఎక్కిన వ్యక్తుల వివరాలు తెలిసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles