కందకుర్తి వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి

Mon,October 21, 2019 12:20 AM

రెంజల్ : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల్లో మూడు నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది. కందకుర్తి వద్ద త్రివేణి సంగమంలో హరిద్ర, మంజీర నదుల నుంచి వరద వస్తుండడంతో గోదావరి నిండుగా పారుతోంది. ఆదివారం నదిలో పురాతన శివాలయం నీటమునిగింది. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో మహారాష్ట్ర అధికారులు, పోలీసులు ఆదివారం సాయంత్రం కందకుర్తి గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. జాలర్లు నదిలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles