పలు గ్రామాల్లో ఘనంగా బోనాల పండుగ

Mon,October 21, 2019 12:19 AM

బాన్సువాడ రూరల్ /బీర్కూర్ : బాన్సువాడ మండలంలోని పోచారం, ఇబ్రహీంపేట్, దేశాయిపేట్, బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో బోనాల పండుగను ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోచారం, మల్లాపూర్ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని బోనం ఎత్తుకొని గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పంటలు వచ్చే ముందు గ్రామదేవతలకు పండుగ చేయడం అనవాయితీ అన్నారు. మల్లాపూర్ గ్రామస్తులు స్పీకర్‌కు మంగళహారతులు, భాజాభజంత్రీలతో స్వాగతం పలికారు. గ్రామంలో ద్రోణపల్లి అశోక్, సతీశ్, రమేశ్ దంపతులు మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించడంపై వారిని అభినందనించారు. అనంతరం పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles