టైటిల్ కోసం హోరాహోరీ

Sun,October 20, 2019 04:25 AM

నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లి గ్రామ ఎస్‌ఎస్‌ఆర్ స్కూల్ ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీబీఎస్‌ఈ అండర్-17,19 బాలబాలికల అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు శనివారం విజయవంతంగా ముగిశాయి. సీబీఎస్‌ఈ చెన్నై రీజియన్ పరిధిలోకి వచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొత్తం 70 జట్లు, 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శనివారం ఫైనల్ పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్యగౌడ్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు అనుకువగా ఉండాలని, ఓడిన వారు విజయానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. టోర్నీ విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సీబీఎస్‌ఈ చెన్నై రీజియన్ పర్యవేక్షకుడు చిన్నయాన్ మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌ఆర్ స్కూల్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన క్రీడలు విజయవంతమైనట్లు తెలిపారు. మంచి ఆతిథ్యం ఇచ్చి విజయవంతంగా క్రీడలు నిర్వహించినందుకు ఎస్‌ఎస్‌ఆర్ స్కూల్ మేనేజ్‌మెంట్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి అసౌకార్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన మారయ్యగౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేత జట్లకు పాఠశాల కరస్పాండెంట్ హరిత, మారయ్యగౌడ్ కప్‌లు, ప్రశంసా పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఆర్ పాఠశాల కరస్పాండెంట్ హరిత, మారయ్యగౌడ్, ఎంపీపీ సంగెం శ్రీనివాస్,జడ్పీటీసీ నీరడి సవిత, సర్పంచ్ క్యామాజీ సబిత, చెన్నై రీజియన్ పర్యవేక్షకుడు చిన్నయాన్, ప్రిన్సిపాల్ భాస్కర్, ఉప సర్పంచ్ గౌరు రాజు, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, నాయకులు తెడ్డు పోశెట్టి, క్యామాజీ సంజీవ్‌రావు, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, మల్లేశ్, కోచ్‌లు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గ్గొన్నారు.

అండర్-17 బాలుర విభాగంలో..
ఈ టోర్నీలో అండర్-17 బాలుర విభాగం ఫైనల్స్‌లో శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్ (విశాఖపట్నం), అరబిందో పబ్లిక్ స్కూల్ తలపడ్డాయి. శ్రీప్రకాశ్ విద్యానికేతన్ విజయం సాధించింది.

బాలికల విభాగంలో..
అండర్ -17 బాలికల విభాగంలో ఫైనల్స్‌లో విజ్ఞాన్ విద్యాలయం, వీఎస్ సెయింట్ జోన్స్ సెకండరీ స్కూల్ గన్నవరం(చిత్తూరు) తలపడ గా.. వీఎస్ సెయింట్ జోన్స్ సెకండరీ స్కూల్ జట్టు గెలుపొందింది.

అండర్-19 బాలుర విభాగంలో..
అండర్- 19 బాలుర విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నంద్యాల పబ్లిక్ స్కూల్ మధ్య పోటీ తీవ్రంగా సాగగా.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టు విజయ సాధించింది.

బాలికల విభాగంలో..
అండర్-19 బాలికల విభాగంలో దావ్ సెయింట్ పబ్లిక్ స్కూల్-డీడీఎంఎస్‌పీ(విశాఖపట్నం), ఓబుల్‌రెడ్డి స్కూల్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. దావ్ సెయింట్ పబ్లిక్ స్కూల్(విశాఖపట్నం)విజయం సాధించింది.

ద్వితీయస్థానంలో నిలిచిన జట్లు..
అండర్- 17 బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో అరబిందో పబ్లిక్ స్కూల్(నల్గొండ), అండర్- 17 బాలకల విభాగంలో విజ్ఞాన్ విద్యాలయం ( హైదరాబాద్ ), అండర్- 19 బాలుర విభాగంలో నంద్యాల పబ్లిక్ స్కూల్(కర్నూల్), అండర్ -19 బాలికల విభాగంలో డీడీఎంఎస్‌పీ ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్(హైదరాబాద్) నిలిచాయి.

తృతీయ స్థానంలో నిలిచిన జట్లు..
అండర్ -17 బాలుర విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (విజయవాడ), అండర్- 17 బాలికల విభాగంలో రిడ్జ్ స్కూల్ (కర్నూల్), అండర్- 19 బాలుర విభాగంలో ది ఆదిత్య బిర్లా పబ్లిక్ స్కూల్ (కర్నూల్), అండర్ 19 బాలికల విభాగంలో భారతీయ విద్యాభవన్ (బెల్) హైదరాబాద్ నిలిచాయి.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles