ముగిసిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు

Sun,October 20, 2019 04:24 AM

నస్రుల్లాబాద్: రెండు రోజుల నుంచి మండలంలోని అంకోల్ గ్రామంలో నిర్వహిస్తున్న 65వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 19 బాలుర, బాలికల కుస్తీ పోటీలు శనివారం ముగిశాయి. దేశాయిపేట్ సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం కుస్తీ పోటీలను ఆసక్తిగా ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు అంకోల్‌లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. ఈ కుస్తీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను పోత్సహించేందుకు కృషి చేస్తున్నదన్నారు. నియోజకవర్గంలో ఏ క్రీడలు నిర్వహించినా తన వంతు సహకారం అందిస్తానన్నారు. పూర్తి బాధ్యతను టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎజాజ్‌కు అప్పగిస్తానన్నారు. కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ తారాచంద్ మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి 240 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన అండర్ 17, 19 బాల బాలికలు వచ్చే నెలలో ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొంటారన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles