సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు

Sun,October 20, 2019 04:24 AM

నిజామాబాద్ సిటీ : సాధించాలనే సంకల్పం ఉంటే ఎన్ని సవాళ్లనైనా అధిగమించి విజయం సాధించవచ్చని కలెక్టర్ రామ్మోహన్‌రావు ఉద్బోధించారు. కలెక్టరేట్ మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి ఆరో కుస్తీ పోటీలను శనివారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారిణులు అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, సదుపాయాలు లేకున్నా కూడా సర్దుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలను అందుకున్నారని తెలిపారు. సౌందర్య, మాలావత్ పూర్ణ, నిఖత్ జరీన్ తదితరులు జిల్లాస్థాయిని ఇనుమడింప చేశారని తెలిపారు. వారితో పాటు వారి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకువచ్చారన్నారు. వారిలో ఉన్న సంకల్పబలం వారిని ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లి అనుకున్నది సాధించాలని తెలిపారు. రెజ్లింగ్ క్రీడాకారులు కూడా జిల్లా, రాష్ట్ర స్థాయిలో వారి ప్రతిభను కనబర్చి మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఆర్డీవో వెంకటేశ్వర్లు, నుడా చైర్మ న్ ప్రభాకర్‌రెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ డీవైఎస్‌వోలు బాబురావు, అశోక్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు రాజేందర్ రెడ్డి, నర్సింగరావు, వెంకటేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles