సాఫీగా ప్రయాణం

Sat,October 19, 2019 02:00 AM

-అన్ని రూట్లలో తిరిగిన ఆర్టీసీ బస్సులు
-పర్యవేక్షిస్తున్న రెవెన్యూ అధికారులు
-ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు

కామారెడ్డి, నమస్తేతెలంగాణ : రోజు రోజుకు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుతూ పల్లె నుంచి పట్నం వరకు బస్సులు పరుగులు తీస్తున్నాయి. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కామారెడ్డి ఆర్టీసీ డిపోలోని బస్సులను అన్ని రూట్లలో నడుపుతున్నారు. ఆర్టీసీ సమ్మె శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. సమ్మె ప్రభావం కనిపించకుండా అధికారులు సమన్వయంతో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడుపుతున్నారు. పల్లె వెలుగు బస్సులతో పాటు నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. కామారెడ్డి డిపో నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచారు. డిపో నుంచి వెళ్తున్న జేబీఎస్, నిజామాబాద్, కరీంనగర్, రామాయంపేట్, ఎల్లారెడ్డి బాన్సువాడ, వరంగల్ తదితర దూర ప్రాంతాలతో పాటు పల్లెలకు కూడా బస్సుల సంఖ్యను పెంచారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఆర్టీసీ బస్సులు
కామారెడ్డి డిపో నుంచి రోజురోజుకూ బస్సుల సంఖ్య పెంచుతున్నారు. పల్లె వెలుగుతో పాటు ఎక్స్‌ప్రెస్‌లు, మినీ బస్సులు, లగ్జరీ బస్సులు, డీలక్స్ బస్సులు తిరుగుతున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లలతో అన్ని రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అధికారులకు డిపో, బస్టాండ్‌లో డ్యూటీలను కేటాయించారు. ఇప్పటికే రెవెన్యూ పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో బస్సులను పంపుతున్నారు. ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేయడంతో ప్రయణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు వెళ్తున్నాయి. బస్టాండ్‌లో ప్రయణికులతో బస్సులతో కిటకిటలాడుతుంది. ప్రయణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. శుక్రవారం సమ్మె 14వ రోజుకు చేరినా ప్రభావం కనిపించలేదు. కామారెడ్డి డిపో నుంచి 96 ఆర్టీసీ బస్సులు, 38 హైర్ బస్సులు, వీటితో పాటు పాఠశాలల బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రయణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి.

కార్మికుల నిరసన
కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి 14 రోజుకు చేరుకుంది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కార్మికులు టెంట్ వేసి వంటావార్పు చేస్తూ నిరసన తెలిపారు. నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించి తిరిగి టెంట్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles