దోమకొండలో కేంద్ర కాగ్ బృందం పర్యటన

Sat,October 19, 2019 01:58 AM

దోమకొండ : మండల కేంద్రంలో కేంద్ర కాగ్ బృందం శుక్రవారం పర్యటించింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేంద్ర కాగ్ బృందం సభ్యులు వినయ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ వెంకటేశ్వర్‌రావు ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై గ్రామస్తులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, క్రాప్ లోన్, పావలా వడ్డీ రుణాలపై రైతుల వద్ద సమాచారం సేకరించారు. గ్రామంలో మరో నాలుగు రోజులు పర్యటించి సుమారు వంద మంది రైతుల అభిప్రాయాలు సేకరించి ఈ పథకాల ద్వారా రైతులకు చేకూరుతున్న లబ్ధిని ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. వారి వెంట సర్పంచ్ అంజలి, విండో చైర్మన్ నర్సారెడ్డి, జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, ఏవో పవన్, డిప్యూటీ తహసీల్దార్ తిర్మల్‌రావు, కేంద్ర కాగ్ తనిఖీ బృందం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles