ఆడబిడ్డలకు అండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం

Sat,October 19, 2019 01:57 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఆడబిడ్డలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 186 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 33 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేసి రూ. 1,00,116 అందించడం గొప్పవిషయన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నదన్నారు. నియోజకవర్గంలోని 186 మంది లబ్ధిదారులకు కోటీ 82 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 33 మందికి మంజూరైన 19 లక్షల 28 వేల రూపాయల చెక్కులను సైతం అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీబీపేట్ ఎంపీపీ బాలమణి, భిక్కనూర్ ఏఎంసీ చైర్మన్ అమృతరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, గోపాల్‌రెడ్డి, గరిగెంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles