దంచికొట్టిన వాన..

Fri,October 18, 2019 01:28 AM

-నేలకొరిగిన వరి పంటల
-లింగంపేట్, భిక్కనూరు మండలాల్లో నష్టం
-పలుచోట్ల తడిసిన ఆరబెట్టిన మక్కలు
-ఆందోళనకు గురవుతున్న అన్నదాతలు

లింగంపేట/ భిక్కనూరు : రెండు మండలాల్లో గురువారం వర్షం కురిసింది. లింగంపేట్ మండలంలోని కోమట్‌పల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్, పోల్కంపేట గ్రామాలతో పాటు భిక్కనూరు మండలంలో వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో చేతికి వచ్చిన వరి పంట నేలవాలింది. లింగంపేటలో వంద ఎకరాల వరకు వరి పంట నష్టపోయినట్లు రైతులు తెలిపారు. భిక్కనూరు ఆరబెట్టుకున్న మక్కలు తడిసిపోయాయి. 15 నుంచి 20 రోజుల వ్యవధిలో వరి పంట చేతికి రానుండగా వర్షాలతో పంట నష్టపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles