సాలు నాటుతో అధిక దిగుబడులు

Fri,October 18, 2019 01:26 AM

లింగంపేట: వరి పంట సాగులో సాలు నాటు వేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేంద్రయ్య తెలిపారు. ఆత్మ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నాగారం గ్రామంలో ప్రయోగాత్మకంగా సాలు నాటు వేశారు. ఈ పద్ధతిలో సాగుచేసిన వరి పంటను ఆయన గురువారం పరిశీలించారు. సాలునాటు పద్ధతిలో వేసిన నారుకు 40 పిలకలు వచ్చినట్లు తెలిపారు. అధిక పిలకలు రావడంపై రైతు సుధాకర్ హర్షం వ్యక్తం చేశాడు. రానున్న యాసంగిలో మూడు ఎకరాల పంట సాగు చేయనున్నట్లు రైతు చెప్పాడు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు యాసంగిలో సాలునాటు పద్ధతిలో నాటు వేయాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి సాయిరమేశ్‌గౌడ్, వ్యవసాయ విస్తీర్ణాధికారి ప్రశాంత్‌తో పాటు గ్రామానికి చెందిన రైతులు ఉన్నారు.

వ్యవసాయ కార్యాలయం తనిఖీ..
నిజాంసాగర్, నమస్తే తెలంగాణ : మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేంద్రయ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. 30 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన పనులు, అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏఈవో స్వర్ణలత ఉన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles