జోరుగా ప్రజారవాణా

Fri,October 18, 2019 01:25 AM

కామారెడ్డి నమస్తేతెలంగాణ : ఆర్టీసీ అన్ని రూట్లలో బస్సులను నడపడంతో ప్రయణికులకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కార్మికుల స మ్మె కొనసాగుతున్నప్పటికీ అ ధికారులు ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేయడంతో బస్సులు డిపోల నుంచి తరలుతున్నా యి. నేటికి ఆర్టీసీ కార్మికుల ప్రారంభించి సమ్మె 13వ రోజుకు చేరుకుంది. డిపో పరిధిలోని అన్ని రూట్లతో పాటు దూర ప్రాంతాలైన జేబీఎస్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రామాయంపేట్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర రూట్లలో బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. కామారెడ్డి డిపో నుంచి జేబీఎస్‌కు నాన్ స్టాప్ బస్సులు నడుపుతున్నారు. తాత్కాలిక డ్రైవర్‌ర్లు, కండక్టర్లతో ప్రజా రవాణా కొనసాగుతున్నది. ప్రయణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతున్నారు. దీంతో సమ్మె ప్రభావం కనిపించడం లేదు. కామారెడ్డి డిపో నుంచి ఆర్టీసీ బస్సులు ఉదయం నుంచే రోడ్లపైకి పరుగులు పెడుతున్నాయి.

ఆర్టీసీ రవాణా పోలీసు రెవెన్యూ శాఖ సమన్వయంతో బస్సుల్లో ప్రయాణికులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. అధిక చార్జీలు వసూలు చేయకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రవాణా శాఖ అధికారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించి విధులకు పంపిస్తున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో కూడా జోరుగా ప్రజారవాణా కొనసాగుతున్నది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు ఆర్డినరీ బస్సులు అన్ని రూట్లలో ప్రయణికులను చేరవేస్తున్నాయి. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో 99 ఆర్టీసీ బస్సులు, 38 ప్రైవేటు బస్సులు, వీటితో పాటు పాఠశాలల బస్సులు ప్రైవేటు వాహనాల్లో ప్రయణికులు తరలివెళ్తున్నారు. డిపో, బస్టాండ్‌లో కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ రామకృష్ణ పోలీసు బందోస్తు నిర్వహిస్తున్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles