ప్రాణం తీసిన అతివేగం

Fri,October 18, 2019 01:25 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : వేగంగా వెళ్తున్న కారు టైరు ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు దుర్మరణం చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. డిచ్‌పల్లి ఎస్సై సురేశ్‌కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన కానుల గంగవ్వ(75) అతని పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నది. నిజామాబాద్ నగరంలోని హనుమాన్‌నగర్‌లో ఉంటున్న చిన్న కుమారుడు భూమయ్య తన స్విఫ్ట్ డిజైర్ కారులో తల్లిని తీసుకొని నిజామాబాద్ బయలుదేరారు. వేగంగా వెళ్తున్న కారు డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా హైవేపై టైరు పేలడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ఇనుప గ్రిల్స్‌ను ఢీకొట్టి, పక్కనే ఉన్న 7వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఇనుప జాలీలపై దూసుకెళ్లింది.

ప్రమాదంలో కానుల గంగవ్వ, వంగాల రవీందర్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న డ్రైవర్ భూమయ్య, చిక్కడిపల్లి గంగాధర్, రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కున మృతదేహాలు, క్షతగాత్రులను సమీపంలోని ఏడో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ సిబ్బంది వెంటనే స్పందించి బయటికు తీశారు. విషయం తెలుసుకున్న డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. గాయపడిన ముగ్గురిని హైవే అథారిటీ అంబులెన్స్, 108 అంబులెన్స్‌ల్లో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద స్థలాన్ని నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు పరిశీలించారు. వంగాల సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్‌కుమార్ తెలిపారు.

ఉలిక్కిపడ్డ స్పెషల్ పోలీసులు..
44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన వారి కళ్లముందే జరగడంతో 7వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో సెంట్రీ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుళ్లు రవి, మోజీరామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోడ్డుపై నుంచి ఒక్కసారిగా కారు పల్టీలు కొడుతూ ఇనుప చువ్వలను ఢీకొని, బెటాలియన్‌లో తాము సెంట్రీ చేస్తున్న చోటుకు దూసుకు రావడం చూశామని, అందులోంచి గంగవ్వ కిందపడి మృతి చెందడం తాము చూశామన్నారు. సమీపంలో ఉన్న సివిల్ పోలీసులతో కలిసి కారులో ఇరుక్కున్న వారిని బెటాలియన్ పోలీసులు బయటకు తీశారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles