జిల్లాలో రోడ్డెక్కిన 91% బస్సులు..

Fri,October 18, 2019 01:24 AM

నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో గురువారం 86 శాతం బస్సులు నడిచాయి. కామారెడ్డి జిల్లాలో 91 శాతం బస్సులను వివిధ రూట్లలో నడిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెం చుతున్నారు. 13వ రోజు గురువారం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 458 బస్సులను నడిపించారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 267 బస్సులు నడిచాయి. ఆర్మూర్ డిపో పరిధిలో 69, బోధన్ డిపో పరిధిలో 68, నిజామాబాద్-1 డిపో పరిధిలో 65, నిజామాబాద్ -2 డిపో పరిధిలో 65 బస్సులు ప్రయాణికులను తరలించాయి. నిజామాబాద్ జిల్లాలో 82శాతం బస్సులు నడిచాయి. నిజామాబాద్ రీజియన్ పరిధిలో వచ్చే కామారెడ్డి జిల్లాలో గురువారం 91శాతం బస్సులను అధికారులు నడిపించారు. కామారెడ్డి డిపో పరిధిలో 99 , బాన్సువాడ డిపో పరిధిలో 82 బస్సులు నడిచాయి. కామారెడ్డి డిపో నుంచి హైదరాబాద్, సిద్దిపేట్, మెదక్ జిల్లాలకు నాన్‌స్టాప్ బస్సులు నడిచాయి. నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, అదిలాబాద్, బోధన్, బాన్సువాడ నుంచి కామారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు వెళ్లాయి.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles