దళారుల చేతిలో మోసపోవద్దు

Fri,October 18, 2019 01:24 AM

బీర్కూర్ : జిల్లాలోని రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని జిల్లా పౌరసరఫరాల అధికారిణి మమత అన్నారు. మండలంలోని బరంగేడ్గి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె గురువారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా గతంలో మాదిరిగానే 223 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించేందుకు కృషిచేస్తున్నామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సతీశ్, డీఎస్‌వో జితేంద్రప్రసాద్, డీఎం కొండల్‌రావు, సొసైటీ చైర్మన్ రాజప్ప, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, కోఆప్షన్ సభ్యుడు ఆరీఫ్, రైతు సమన్వయ సమితి సమన్వయకర్త ద్రోణవల్లి అశోక్, గ్రామ సమన్వయకర్త ఇందూరి గంగాధర్, తహసీల్దార్ బాలశంకర్, ఏవో కమల, సొసైటీ కార్యదర్శి విఠల్, గిర్దావార్ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వీరేశం, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, ఎస్సీ విభాగం మండలాధ్యక్షుడు బోయి లాలయ్య పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles