అన్ని రూట్లలో బస్సులు..

Thu,October 17, 2019 01:40 AM

-ఉదయం నుంచే పంపే విధంగా చర్యలు
-డిపోల్లోనే రెవెన్యూ అధికారులు
-ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాఫీగా ప్రయాణం

అన్నిరూట్లలో వందశాతం బస్సులు నడిపించాలన్న రవాణాశాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయమే డిపోలకు చేరుకుంటున్న రెవెన్యూ అధికారులు తాత్కాలిక సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. ప్రజారవాణా సాఫీగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రూట్లలో బస్సులు నడుస్తుండడంతో ప్రయాణ ప్రాంగణాలకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. బుధవారం కామారెడ్డి బస్టాండ్‌ను కలెక్టర్ సత్యనారాయణ తనిఖీ చేశారు. ప్రయాణికులు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కామారెడ్డి, నమస్తే తెలంగాణ /విద్యానగర్: అన్ని రూట్లలో ఆర్టీసీ ట్రిప్పులను పెంచారు. ఉదయం 4 గంటల నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించారు. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం ఆర్టీసీ బస్సులు 95, అద్దె బస్సులు 38 పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు నడిపించారు. బుధవారం 12వ రోజు సమ్మె ప్రభావం పడకుండా పోలీసు, రెవెన్యూ ఆర్టీసీ ఆర్టీవో శాఖల అధికారులు బస్సులను యథావిధిగా పంపించారు. ప్రయణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్‌లో బస్సులను సిద్ధంగా ఉంచుతున్నారు. బస్సులు అన్ని రూట్లలో వెళ్లడంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది.
బస్టాండ్‌ను సందర్శించిన కలెక్టర్ సత్యనారయణ..

బుధవారం సాయంత్రం కామారెడ్డి బస్టాండ్‌ను, డిపోను కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బస్సు చార్జీల వసూళ్లలో తేడా రాకుండా చూడలని ఆదేశించారు.కలెక్టర్ వెంట డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్డీవో రాజేంద్రకుమార్, డిపో డివిజినల్ మేనేజర్ గణపతిరాజు, ఆర్టీవో వాణి తదితరులు ఉన్నారు.

కార్మికుల ఆందోళన..
సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసర కార్యక్రమాలు చేపట్టాయి. ముందుగా బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా, ఇందిరాచౌక్, సుభాష్‌రోడ్, సిరిసిల్ల రోడ్ మీదుగా సాగింది. అనంతరం నిజాంసాగర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. పట్టణంలో కార్మికులు భిక్షాటన చేశారు. ప్రభుత్వం వెంటనే న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles