వారం రోజుల్లో సిటీ శానిటేషన్ ప్లాన్ సిద్ధం చేయండి

Thu,October 17, 2019 01:38 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: వారం రోజుల్లో సిటీ శానిటేషన్ ప్లాన్లు సిద్ధంచేసి తనకు సమర్పించాలని కలెక్టర్ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి సిటీ శానిటేషన్ ప్లాన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 30 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో మంచి మార్పు వచ్చిందని, ఆదే స్ఫూర్తితో మున్సిపాలిటీల్లోనూ శానిటేషన్ ప్లాన్ ప్రకారం స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్‌కు తరలించడం, రీసైక్లింగ్ వంటివాటికోసం ఏర్పాట్లు, సిబ్బంది, బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలో టాయిలెట్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో లాంగ్‌స్పేస్ ప్రాంతాలను గుర్తించి పార్కులుగా అభివృద్ధి చేయడం, ఓపెన్ జిమ్‌లు, ఎల్‌ఈడీ విధిదీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.

చెత్తను తరలించేందుకు కామారెడ్డి మున్సిపాలిటీకి 35 ఆటోలు, ఎల్లారెడ్డికి 9, బాన్సువాడకు 5 ఆటోలు అవసరమున్నట్లు గుర్తించారు. అనంతరం జిల్లా కొనుగోలు కమిటీతో సమావేశం నిర్వహించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా 500 జనాభా దాటిన ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, బ్లేడ్ కొనుగోలు ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేసుకోవాలని కమిటీకి సూచించారు. నిబంధనల మేరకు డ్రైవర్ల ఎంపిక చేపట్టాలన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీకి 12, ఎల్లారెడ్డికి రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఆర్టీవో వాణి, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, సీపీవో శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి రఘునాథ్, డీపీవో నరేశ్, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్లు శైలజ, కుమారస్వామి, వెంకటేశం పాల్గొన్నారు.అన్ని రూట్లలో బస్సులు..

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles