19 నుంచి రాష్ట్రస్థాయి కుస్తీపోటీలు

Thu,October 17, 2019 01:37 AM

నిజామాబాద్ సిటీ: రాష్ట్రస్థాయి సీనియర్ మహిళలు, పురుషుల కుస్తీపోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి 20 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు రెజ్లింగ్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. బుధవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కుస్తీ పోటీలను జిల్లా స్విమ్మింగ్ పూల్ ఆవరణలో నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు ఏఎంసీలో, మహిళలకు ఇందూరు హైస్కూల్‌లో బస చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అతిథులకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్ సుబేదార్, విజయ్‌కాంత్, శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles