పిల్లలకు వందశాతం ఎంఆర్ టీకాలు

Thu,October 17, 2019 01:37 AM

విద్యానగర్: మీజిల్స్, రుబెల్లా వ్యాధులు సోకకుండా పిల్లలకు వందశాతం టీకాలు ఇప్పించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అనిల్‌కుమార్ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం జనహిత సమావేశ మందిరంలో వైద్య సిబ్బందికి అవగాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. మీజిల్స్, రుబెల్లా వ్యాధులను నివారించేందుకు జిల్లాలోని చిన్న పిల్లలందరికీ ఎంఆర్ టీకాలు ఇస్తున్నామని తెలిపారు. తట్టు, రుబెల్లా లక్షణాలు కనిపించిన పిల్లలను గుర్తించి వారి రక్త నమూనాలు ల్యాబ్‌లో టెస్ట్ చేయించాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేయాలన్నారు. అనంతరం సర్వైలెన్స్ మెడికల్ అధికారి అతుల్ నిగమ్ వైద్య అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి, కరుణ శ్రీ, డాక్టర్ రఘుపతి, పీహెచ్‌సీ వైద్యలు, డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles