జూలై 24న రెగ్యులర్ వీసీ సాంబయ్య పదవీ బాధ్యతలు ముగిశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు పలు వర్సిటీలకు సీనియర్ ఐఏఎస్‌లను ఇన్చార్జి వీసీలుగా నియమించింది. ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇన్చార్జి వీసీ నియమితులయ్యారు. జూలై 25న బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 3న యూనివర్సిటీల చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్ని వర్సిటీల సెర్చ్ కమిటీలతో సమావేశమైనట్లు తెలిసింది. వర్సిటీలకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమర్థులనే వీసీలుగా పంపాలన్న గవర్నర్, ప్రభుత్వ నిర్ణయాల మేరకు మరికొద్ది రోజులే ఇన్చార్జి వీసీల పాలన సాగనుంది.