ప్రగతి పనులపై దృష్టి సారించాలి..

Tue,October 15, 2019 01:27 AM

-వైకుంఠధామం, డంప్ యార్డు పనులు పూర్తిచేయాలి..
-మంకీ ఫుడ్‌కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
-ప్రగతి గ్రామంలో నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ సత్యనారాయణ

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రతీ గ్రామంలో వైకుంఠ ధామం, డంపింగ్ యార్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేనిచోట వెంటనే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జనహిత భవన్‌లో వివిధ శాఖల అధికారులతో సోమవారం కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. 30 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంప్‌యార్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఏదైనా గ్రామంలో ఇంకా పనులు చేపట్టకపోతే వెంటనే చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీ తప్పనిసరి అని, నర్సరీల్లో మొక్కలు పెంచే వివరాలతో బోర్డు, గేట్ ఏర్పాటు చేయాలన్నారు. మేకలు, పశువులు నర్సరీల్లోకి రాకుండా కాటరేన్ ట్రాప్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల 15లోగా మొక్కల జాతి రకాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, 17లోగా స్థలాల ఎంపిక చేసి చదును పూర్తి చేయాలని, వనసేవకున్ని నియమించుకోవాలని అన్నారు.

18లోగా ఎస్టిమేషన్, మండల ప్లాన్ జనరేట్ చేసి పీడీ లాగింగ్‌కు పంపాలని, 20 లోగా వివిధ రకాల విత్తనాలు, టేకు స్టంప్స్ కొనుగోలు చేయాలని, 22లోగా పాలిథిన్ బ్యాగులు కొనుగోలు చేసి మట్టి సేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. 23 లోగా బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 25 లోగా ఎర్రమట్టి బ్యాగులు నింపే పనులు ప్రారంభించి కంచెలు ఏర్పాటు చేయాలని, 28 లోగా బ్యాగులు నింపే పని పూర్తి చేయాలని వివరించారు. వచ్చే నెల 5వ తేదీలోగా లోగా ప్రైమరీ బెడ్‌లలో విత్తనాలు నింపే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో గ్రీన్ ప్లాన్‌కు ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. మంకీ ఫుడ్ కోర్టులకు సంబంధించి 143 స్థలాల్లో 315 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. జిల్లాలోని వాగులకు ఇరువైపులా మంకీ ఫుడ్ కోర్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి, నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జేసీ యాదిరెడ్డి, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, జడ్పీ సీఈవో కాంతమ్మ, డీఎఫ్‌వో వసంత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles