వెల్లువలా దరఖాస్తులు

Tue,October 15, 2019 01:21 AM

కామారెడ్డి నమస్తేతెలంగాణ : మద్యం దుకాణా లకు జోరుగా దరఖాస్తులు వస్తున్నాయి. సోమవారం ఒకేరోజు 54 దరఖాస్తులు దాఖలయ్యా యి. ఎక్సైజ్ శాఖ నూతన మద్యం విధానాన్ని అ మల్లోకి తీసుకురావడంతో పాటు దరఖాస్తు రేట్లను పెంచినప్పటికీ అభ్యర్థులు ఉత్సాహంగా దరఖాస్తులు వేస్తున్నారు. కొద్ది రోజులుగా పండగ సీజన్‌తో పాటు మంచి రోజులు లేకపోవడంతో సోమవారం ఒకే రోజు 54 దరఖాస్తులు వచ్చా యి. ఎక్సైజ్ శాఖ మద్యం దరఖాస్తులకు గతంలో లక్ష రూపాయలు ఫీజు ఉండగా ప్రస్తుతం రెండు లక్షలకు పెంచినప్పటికీ ఉత్సాహంగా దరఖాస్తులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 మద్యం షాపులకు ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 86 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 16 మంది మహిళలు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. మద్యం షాపులకు ఈ నెల 16వ తేది చివరి తేదీగా నిర్ణయించారు. 18 న జిల్లా కేంద్రంలోని రేణుకాదేవి ఫంక్షన్ హాలులో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా షాపులను ఎంపిక చేయనున్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles