డెంగీ, మలేరియాపై అవగాహన ర్యాలీ

Tue,October 15, 2019 01:20 AM

విద్యానగర్ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందం డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి సోమవారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఈ ర్యాలీని డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు కళాజాత బృందాలు గ్రామాల్లో డెంగీ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రమేశ్, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు చలపతి, హబీబ్, సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles