సమన్వయంతో ముందుకు..

Mon,October 14, 2019 02:47 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ,విద్యానగర్ : అన్ని రూట్లలో ప్రజారవాణా యథాతథంగా కొనసాగుతున్నది. తొమ్మిదో రోజైన ఆదివారం ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిసించలేదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. సెలవు దినం అయిన ఆదివారం ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం సందడిగా మారింది. కామారెడ్డి డిపో నుంచి 86 ఆర్టీసీ,36 అద్దె బస్సులు నడిపించారు. డిపో నుంచి హైదరాబాద్, నిజామాబాద్, నిజాంసాగర్, కరీంనగర్, రామాయంపేట్, బాన్సువాడ తదితర ప్రాంతాలకు బస్సులు నడిచాయి. బస్టాండ్‌లోని ప్లాట్ ఫాంల వద్ద బస్సులను సిద్ధంగా ఉంచారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులను తరలించారు.

ప్రభుత్వ శాఖల సమన్వయంతో ..
రోజురోజుకూ ప్రయాణికుల సందడి పెరగడంతో ఇబ్బందులు తలెత్తకుండా కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందికి డిపో, బస్టాండ్‌లో డ్యూటీలను వేసి బస్సుల రాకపోకను కొనసాగిస్తున్నారు. అలాగే డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎం ఆంజనేయులు, ఎంవీఐ శ్రీనివాస్‌రావు ఇలా పలు శాఖల అధికారులు సమన్వయంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులను గమ్యస్థానాలకు పంపిస్తున్నారు. అధికారులు దగ్గరుండి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బస్సులను తరలిస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో నిరంతరం బందోబస్తు నిర్వహిస్తున్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles