స్వరాష్ట్రంలోనే నిరుపేదలకు భూముల పంపిణీ

Sat,October 12, 2019 12:07 AM

పిట్లం : రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ చేసి వారి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని జిల్లా షెడ్యుల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు భూ అభివృద్ధి చేసుకునే విధంగా ప్రభుత్వం ద్వారా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జుక్కల్ నియోజకవర్గంలోని 235 మంది లబ్ధిదారులకు 512.32 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం రూ. 26 కోట్ల 55 లక్షల 95 వేలతో కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు తెలిపారు.

మొదటి విడతలో రూ. 73 లక్షలను రైతులకు భూ అభివృద్ధి కోసం అందజేశామని, రెండో విడత కింద 29 మందికి జుక్కల్ నియోజకవర్గంలో ఇప్పుడు రూ. 11 లక్షల 9 వేల 600 రూపాయల చెక్కులను భూమిని అభివృద్ధి చేసుకునేందుకు పూర్తి సబ్సిడీతో అందజేసినట్లు వివరించారు. వీరికి సింగిల్‌ఫేజ్ మోటార్లు ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లకా్ష్మరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చందర్, శంకర్, టీఆర్‌ఎస్ మండల నాయకులు బాల్‌రెడ్డి, విజయ్, జగదీశ్, నర్సాగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles