వృద్ధులతో ప్రేమ, గౌరవంగా వ్యవహరించాలి

Sat,October 12, 2019 12:06 AM

విద్యానగర్ : వృద్ధులతో ప్రతి ఒక్కరూ ప్రేమ, గౌరవంతో వ్యవహరించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సీనియర్ సిటిజన్స్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వయోవృద్ధుల సంరక్షణ పోషణ బాధ్యతకు ఏర్పాటు చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. వృద్ధులతో వారి కుటుంబసభ్యులు ప్రేమ, గౌరవంతో వ్యవహరిస్తే వారి అనుభవం కుటుంబానికి ఉపయోగపడుతుందన్నారు. సీనియర్ సిటిజన్స్ ఎల్లప్పుడూ సత్సంగం చేయాలని, తద్వారా తమ చుట్టూ ఆహ్లాదక పరిస్థితులు నెలకొంటాయన్నారు. నేటి సరిస్థితులలో సమస్యల పరిష్కారానికి వృద్ధుల సలహాలు అవసరమని తెలిపారు.

వృద్ధుల సంరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వయో వృద్ధుల పోషణ, సంక్షేమ నియమావళి -2011 చట్టం ద్వారా వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సంఘం ద్వారా అందుతున్న సేవలకు గాను ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఇన్‌చార్జ్ అధికారిణి అనురాధ, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కార్యదర్శి రాజన్న, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌రావు, సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షుడు భద్రయ్య, వృద్ధాశ్రమం నిర్వహకురాలు శారదాదేవి, పున్న రాజేశ్వర్, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles