కారు అమ్మకానికి ఉందని బురిడీ

Thu,October 10, 2019 04:01 AM

కోటగిరి : కారు అమ్మకానికి ఉందని ఓఎల్‌ఎక్స్‌లో చూసిన బాధితుడిని బురిడీ కొట్టించారు గుర్తు తెలియని వ్యక్తులు. కారు డెలివరీ చేస్తామని నమ్మించి ఏకంగా రూ.61,500 కాజేసిన ఘటన మండలంలోని జల్లాపల్లి అబాదిలో చోటు చేసుకుంది. కోటగిరి మండలంలోని జల్లాపల్లి అబాదికి చెందిన కిశోర్ అనే యువకుడు చెప్పిన ప్రకా రం వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఓఎల్‌ఎక్స్‌లో గుజరాత్ పాసింగ్‌కు చెందిన కారు అమ్మకానికి ఉన్నట్లు ఒక వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో పెట్టాడు. కిశోర్ దానిని గమనించి వాటిలో పెట్టిన వ్యక్తి కిషన్ సెల్‌కు ఫోన్ చేశాడు. షిఫ్ట్ డిజైర్ 2008 మోడల్ కారు అమ్మకానికి పెట్టానని, దాని ఖరీదు రూ.85 వేలు ఉంటుందని తెలిపాడు.

కారు పంపాలంటే ముందుగా ఆధార్ కార్డు తనకు వాట్సప్ చేయాలని, తన ఫోన్‌పే అకౌంట్‌కు కేవలం రూ.6,150లు పంపాలని, మిగితా డబ్బు కారు వచ్చిన తర్వాతే చెల్లించాలని కిషన్ చెప్పాడు. ఈ మాటలు నమ్మిన కిశోర్ ఫోన్‌పే ద్వారా రూ.6,150 వేశాడు. మరుసటి రోజు మళ్లీ కిషన్ ఫోన్ చేసి ఆ కారుకు బీమా చేయించాల్సి ఉందని, కొంత డబ్బు పంపాలని చెప్పగా.. కిశోర్ నమ్మాడు. వెంటనే మరో స్నేహితుడు మోహన్ ఫోన్‌పే ద్వారా రూ.20.100, అనిల్ ఫోన్‌ఫే ద్వారా రూ.22,100, నాగరాజు ఫోన్‌పే ద్వారా రూ.16,700 పంపాడు. ఇలా మొత్తం రూ.61,050 చెల్లించాడు. నాలుగు రోజులు గడుస్తున్నా కారు రాకపోవడంతో కిశోర్ వెంటనే కిషన్ సెల్‌కు ఫోన్ చేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా కిషన్ స్పందించకపో వడంతో బుధవా రం మధ్యాహ్నం పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచే ఫోన్ చేయడంతో కిషన్ ఫోన్ ఎత్తి కారు నిజామాబాద్ దగ్గరకు వచ్చిందని, కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయని, వెంటనే మరో రూ.18 వేలు ఖాతాలో వేయాలని చెప్పాడు. కిషన్‌పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు కిశోర్ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles