అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

Thu,October 10, 2019 04:01 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న బస్సుల్లో ప్రయాణికుల నుంచి సిబ్బంది అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీసీ డిపో మేనేజర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం బస్సులు నడుపుతున్నారని, పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాత్కాలికంగా నియామకమైన డ్రైవర్లు, కండక్టర్లు అధిక చార్జీలు వసూలు చేయవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీలో విధుల నిర్వహణకు ఇతర శాఖల నుంచి సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాలని, కాల్ సెంటర్ నిర్వహణ ద్వారా పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్యనారాయణ, జేసీ యాదిరెడ్డి, రవాణా శాఖ అధికారిణి వాణి, ఆర్టీసీ డీవీఎం గణపతిరాజు, సాయన్న పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles